తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఉపఎన్నిక తర్వాత బాగా చర్చ నడుస్తున్న విషయం కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి గురించే. ఆయన గురించి చర్చ మామూలుగా నడవడం లేదు. ఓవైపు దుబ్బాక ఉపఎన్నిక నడుస్తున్నప్పటికీ… రాములమ్మ పార్టీ మార్పు గురించి జోరుగా ఊహాగానాలు అందుకున్నాయి.
నిజానికి కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న విజయశాంతి కనీసం దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు. అసలు.. దుబ్బాక ఉపఎన్నిక గురించి ఎటువంటి మాటలు మాట్లాడలేదు. కాకపోతే.. రెండు మూడు ట్వీట్లు చేసింది కానీ.. అది కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ మీద మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి కానీ.. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ.. ఆమె ఒక్క మాట మాట్లాడలేదు.
దీంతో.. విజయశాంతి.. పార్టీ మారాలని చూస్తున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ.. ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసింది. దీంతో ఆమె బీజేపీలో చేరడం ఖాయం అయిపోయింది.
అయితే.. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం… విజయశాంతి.. ఇంకో రెండు రోజుల్లో బీజేపీ కండువా కప్పుకోనుందట. దాని కోసమే సమాయత్తం అవుతోందట. రెండు మూడు రోజుల్లో విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోనుంది.. అనేది ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న వార్త. ఆమె మాత్రమే కాదు… విజయశాంతితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారట. చూద్దాం మరి.. రాములమ్మ ఎప్పుడు బీజేపీలో చేరుతుందో?