వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. అలాగే సాగునీటి ప్రాజెక్ట్ లపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఎకరాలకు న్సాగునీరు అందించాలని వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు ఈ కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించనుంది. దీనికోసం ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి పావులు కదుపుతున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ.3,805 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని విజయ్ సాయి రెడ్డి పార్లమెంట్ జీరో అవర్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. త్వరలోనే మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుందని కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలని సీఎం జగన్మోహన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,805కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు.
వైఎస్ జగన్ 2021 వరకు పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి పూనుకున్నారని, ఇలా నిధులు రాకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోతున్నాయని విజయ్ సాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వివారిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కేంద్రం నిధులు విడుదల చేస్తే పోలవరం పనులు మళ్ళీ వేగం పుంజుకొనున్నాయి. నిర్మలా సీతారామన్ ద్వారా విజయ్ సాయి రెడ్డి జగన్ బంపర్ న్యూస్ ను చెప్పారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.