Vijay: పవన్ బాటలోనే నటుడు విజయ్ పొలిటికల్ గేమ్…. రాజకీయపరంగా సక్సెస్ అయ్యేనా?

Vijay: సినీ నటుడు విజయ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇలా రాజకీయాలలోకి వచ్చి విజయ్ తమిళగిల్ కాజీగం (టీవీకే) వాటిని స్థాపించారు అయితే ఈ పార్టీకి ప్రజలలో మిశ్రమ స్పందన లభించిందని చెప్పాలి.

మరో ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే ఈయన ఎన్నికలలో పోటీకి దిగి విజయం సాధిస్తారా అంటే అది చాలా కష్టమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ విజయ్ కి ఓ అద్భుతమైన సలహా ఇచ్చారని తెలుస్తోంది. తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే లాంటి రెండు బలమైన పార్టీలే రాజకీయంగా ఆధిపత్యం చూపిస్తున్నాయి. అన్నాడీఎంకేకు 25% ఓటు బ్యాంక్ ఉంటే, టీవీకే గరిష్ఠంగా 20% ఓట్లు తెచ్చుకోగలదని లెక్కలు చెబుతున్నాయి.

ఇక విజయ్ టీవీకే పార్టీకి ఓటు శాతం కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో పొత్తు ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్తే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని తెలుస్తుంది. ఇలా ఏపీలో పవన్ కళ్యాణ్ బాటలోనే తమిళనాడులో కూడా విజయ్ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగితే తప్పనిసరిగా విజయం అందుతుందని అనంతరం ఈయన కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటే రాజకీయపరంగా తన పార్టీని బలోపేతం చేసుకోవచ్చని తెలుస్తోంది.

ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ దూరమవుతారు అన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మాత్రం ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్గానే ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఇలా సింగిల్ గా పోటీ చేయడం అంటే ఎంతో కష్టతరమైనదని పొలిటికల్ పరంగా సక్సెస్ అందుకోవాలి అంటే విజయ్ ముందున్న మార్గం పొత్తు ధర్మమేనని తెలుస్తుంది.. ఇప్పటివరకు సింగిల్ గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న విజయ్ తీరా ఎన్నికల సమయానికి పవన్ బాటలోనే పొత్తు ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు మరి ఈయన మార్గం ఎటువైపు అనేది తెలియాల్సి ఉంది.