Vijay Deverakonda: ఐదేళ్ల వయసు నుంచే అలా బతకడం నేర్చుకున్నాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ చివరగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ నీ తెచ్చుకుంది. ఈ సినిమా కంటే ముందు సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమా విడుదల అయ్యే సూపర్ హిట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా ఈనెల 31వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ నీ పూర్తి చేసుకున్న మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ పోస్టర్లు అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. విజయ్ గత సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో విజయ్ తో పాటు అభిమానులు అందరూ ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను బోర్డింగ్ స్కూల్ లో వేశారు. అలా అయిదేళ్ల నుంచే నేను అమ్మ నాన్న లేకుండా బతకడం నేర్చుకున్నాను. నేను ఫస్ట్ టైమ్ గొడవ పడినప్పుడు అవతలి వ్యక్తి కంటే తక్కువ దెబ్బలతో వచ్చాను. నాకు సమస్యలు వచ్చినప్పుడు మా నాన్నను తీసుకెళ్లకుండా నేనే ఎదుర్కొన్నాను. నా కెరీర్ లో కూడా నేను ఎలాంటి గైడెన్స్ లేకుండా నా కాళ్ళమీద నేను నిలబడ్డాను అని తెలిపారు విజయ్ దేవరకొండ.