Vijay Devarakonda: ది ట్యాగ్ పై స్పందించిన విజయ్ దేవరకొండ… ఎవరికి తగలనన్ని దెబ్బలు తగిలాయంటూ?

Vijay Devarakonda: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నారు. అనంతరం అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ లైగర్ అనే పాన్ ఇండియా సినిమాని చేశారు. ఈ సినిమా ప్రమోషన్ల టైం లో విజయ్ దేవరకొండ పేరు ముందు సౌత్ సెన్సేషనల్ స్టార్ అనే ఒక టాగ్ ఇచ్చారు. అయితే ఈ ట్యాగ్ గురించి తాజాగా ఈయన స్పందించారు. నిజానకి నా పేరు ముందు ఇలాంటి ట్యాగ్ ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని నా టీమ్ దగ్గర చెబుతూ ఉన్నప్పటికీ అప్పటికే లీక్ చేయడంతో సోషల్ మీడియాలో నా పేరు ముందు రౌడీ స్టార్, సౌత్ సెన్సేషనల్ స్టార్ అంటూ ఎన్నో ట్యాగ్స్ వచ్చాయి. ఈ ట్యాగ్స్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఇకపోతే నా పేరుకు ముందు ది అనే టాగ్ నేనే పెట్టుకున్నాను కానీ దానిపట్ల కూడా విమర్శలు రావడంతో ఆ టాగ్ కూడా తొలగించానని విజయ్ దేవరకొండ తెలిపారు. కేవలం ట్యాగ్స్ కారణంగా ఏ హీరోకి తగలనన్ని దెబ్బలు నాకు తగిలాయని నాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టాగ్స్ పెట్టుకోవచ్చు. నాకంటే పెద్దవారు అలాగే చిన్నవారికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. బహుశా నాకు మాత్రమే అలాంటివి లేవు.. ఇలా మరెవరికి ఎదురు దెబ్బ తగలకూడదు అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.