Vijay Devarakonda: నా కొడుకైనా ఇలానే చేస్తా… తమ్ముడు గురించి పట్టించుకోను: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్ డం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జులై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కు ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి. గత కొంతకాలంగా వరుస ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక గురించి అలాగే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే . అయితే సినిమాల విషయంలో తన తమ్ముడికి ఎప్పుడు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వనని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఆనంద్ ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు అంటే నేను ఫలానా సినిమా చేస్తున్నానని మాత్రమే చెబుతారు అయితే ఆ సినిమా గురించి ఇతర వివరాలను నేను అడిగి తెలుసుకోనని, అలాగే తనకు ఎలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వనని, కథ ఏంటి? దర్శకుడు ఎవరు ? అనే విషయాల గురించి తెలుసుకోనని తెలిపారు. ఎందుకంటే తను ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే ఆ తప్పు నుంచి సరైన పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది అందుకే నేను ఏమి అడగను, సలహాలు కూడా ఇవ్వను కేవలం ఆనంద్ విషయంలోనే కాదు రేపు పొద్దున నాకు కొడుకు పుట్టిన నా పిల్లల విషయంలో కూడా తాను ఇలాగే ఉంటాను అంటూ ఆనంద్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.