Rashmika: అవును అది నిజమే….విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక…ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Rashmika: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మిక మందన్న ఒకరు ఈమె నేషనల్ క్రష్ గా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నా రష్మిక నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై ఈ జంట ఎక్కడ స్పందిస్తూ ఖండించకపోవడంతో నిజమేనని తెలుస్తోంది.

ఇకపోతే విజయ్ దేవరకొండ రష్మిక ఇప్పటివరకు గీతాగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కొత్తకాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందిస్తూ తాను నటిస్తున్నానని హింట్ ఇచ్చారు.మొదటగా మైత్రి మూవీస్‌, రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేస్తూ.. రష్మికను ట్యాగ్ చేశారు. దానికి ఆమె నిజమే గాయ్స్‌ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే సినిమాని ఉద్దేశించి ఈమె ఇలా చెప్పి ఉంటారని అందరూ భావిస్తున్నారు. కానీ HMMLetsee అంటే ఏంటో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా రష్మిక విజయ్ దేవరకొండ మరోసారి కలిసి తెరపై కనిపించబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.