కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవల బీస్ట్ సినిమా ద్వారా ప్లాప్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా తర్వాత విజయ్ నేరుగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 66వ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ మొదటిసారిగా నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ సినిమా టైటిల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇటీవల విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ రానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. జూన్ 22వ తేదీ విజయ్ పుట్టినరోజు కాగా.. జూన్ 21 వ తేదీ మేకర్స్ అభిమానులకి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. జూన్ 21 వ తేదీ విజయ్ షాడో ఫొటోతో డిజైన్ చేసిన పోస్టర్ను రిలీజ్ చేస్తూ.. టైటిల్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. విజయ్ నటిస్తున్న 66వ సినిమాకి “వరిసు” అన్న టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ బిజినెస్ మెన్ లా స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.
విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ బాస్ ఇస్ బ్యాక్ అన్న ట్యాగ్ లైన్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. విజయ్ పుట్టిన రోజు కన్నా ఒక రోజు ముందే ఇలా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఇక ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇప్పటినుండే అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.