బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయ్ దళపతి.. వైరల్ అవుతున్న విజయ్ రెమ్యూనరేషన్?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విజయ్ కి సంభందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయానికి వస్తే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వస్తున్న ‘జావాన్’ సినిమాలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది.

ఇప్పటికే ముంబై లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ తాజాగా ఈ జవాన్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా ఈ జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.

దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్, విజయ్ దళపతి మధ్య వచ్చే సీన్స్ ను సెప్టెంబర్ నెల మధ్యలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్ దళపతి కేవలం ఒక్క రోజు డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం విజయ్ దళపతి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని వినికిడి. విజయ్ దళపతికి డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ తో ఉన్న స్నేహబంధం కారణంగా దర్శకుడు అడిగిన వెంటనే ఈ సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించలేదు. విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.