ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విగ్నేష్ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఏడు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు తాజాగా వివాహ బంధంతో ఒకటయ్యారు. తిరుమలలో వివాహం చేసుకోవాలని భావించిన వీరు కొన్ని కారణాల వల్ల చెన్నైలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల వివాహం జరిగిన వెంటనే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఈ జంట వివాదంలో చిక్కుకుంది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ నిబంధనలను అతిక్రమించే లాగా తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ విషయం గురించి టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార దంపతులు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ విషయం గురించి నయనతార భర్త విగ్నేష్ శివన్ స్పందించాడు. తిరుమలలో జరిగిన సంఘటన గురించి ప్రెస్ మీట్ విడుదల చేశాడు. శ్రీవారిని అగౌరవ పరచటానికి ఇలా చేయలేదు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కాళ్ళకి చెప్పులు ఉన్న విషయం మరచిపోయాము. తిరుమల శ్రీవేంటేశ్వరస్వామి మాకు చాలా ఇష్ట దైవం. గత నెలలో 5 సార్లు శ్రీవారిని దర్శించుకున్నాము. శ్రీవారిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మా వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలియచేస్తున్నాను.
వివాహం జరిగిన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చాము. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఫోటోలు తీసుకోవాలన్న హడావిడిలో కాళ్ళకి చెప్పులు ఉన్న విషయం మరచిపోయాము. మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడవటం తప్పే. ఈ సంఘటన వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ మా క్షమాపణలు. అంటూ విఘ్నేష్ శివన్ ప్రెస్ మీట్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా వారి పెళ్ళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కూడా విగ్నేష్ శివన్ ధన్యవాదాలు తెలియజేశాడు. వివాహబంధం ఒక్కటైన ఈ జంట ఒక్కరోజు కూడా గడవకముందే ఇలా వివాదంలో చిక్కుకున్నారు.