నయనతారకు అలాంటి కండీషన్ పెట్టిన విగ్నేష్ మదర్.. నయన్ ఒప్పుకుంటుందా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార మరి కొద్ది గంటలలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె గతంలో ప్రేమలో విఫలం అయినప్పటికీ ప్రస్తుతం తాను మాత్రం దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి గత కొంత కాలం నుంచి వీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇలా ప్రేమలో విహరించిన ఈ జంట ఈనెల 9వ తేదీ మహాబలిపురంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇక పెళ్లికి దగ్గర పడటంతో పెద్ద ఎత్తున పెళ్లి పనులు జరుగుతున్నాయి.

ఇకపోతే తాజాగా నయనతారకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకోవాలంటే తన తల్లి మీరా కుమారి నయనతారకు ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కండిషన్ కు నయనతార ఒప్పుకుంటేనే తనని కోడలిగా అంగీకరిస్తానని ఆమె చెప్పారట. ఇంతకీ విగ్నేష్ తల్లి పెట్టిన కండిషన్ ఏమిటి అనే విషయానికి వస్తే… వివాహం తర్వాత నయనతార సినిమాలలో నటించకూడదని కండీషన్ పెట్టారట.

తమ కుటుంబంలో అందరూ ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటారని ఎవరూ ఇలా మొహానికి రంగులు వేసుకొని వెండితెరపై కనిపించరని అందుకే, వివాహం తర్వాత తాను కూడా సినిమాలలో నటించకూడదని కండీషన్ పెట్టారట. ఈ కండిషన్ కి నయనతార ఒప్పుకుంటేనే తన కోడలిగా వస్తుందని చెప్పడంతో నయనతార ఆ కండిషన్ కి ఒప్పుకొని, విగ్నేష్ తో పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది.ఇప్పటివరకు ఈమె కమిట్ ఇచ్చిన సినిమాలన్నింటిని పూర్తి చేసిన తర్వాత నయనతార వెండి తెరకు దూరమై కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే స్థిరపడతారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు నయనతారను వెండితెరపై చూడలేమా అంటూ షాక్ అవుతున్నారు.