ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ !

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలివుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కన్నా రామ్ చరణ్ పాత్ర ఎక్కువగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా పై ప్రముఖ జ్యోతిష పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాని సంక్రాంతి సినిమాతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ తో రామ్ చరణ్ ని పోల్చుతూ… జూనియర్ ఎన్టీఆర్ ని శ్రీకాంత్ తో పోల్చాడు. అంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెంన్స్ ఎక్కువగా ఉందని … ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి 80 శాతం జూనియర్ ఎన్టీఆర్ కి 20 శాతం పాత్రని ఇచ్చి ఎన్టీఆర్ పాత్రని తగ్గించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ రాజమౌళి ఎన్టీఆర్ కి అన్యాయం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇలా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని ఆస్కార్ అవార్డు రేసులో నిలిపేందుకు రాజమౌళితో పాటు సినీ నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.