Venu Swamy: విమాన ప్రమాదాన్ని ముందే చెప్పిన వేణు స్వామి… సంచలనంగా మారిన వీడియో!

Venu Swamy: అహ్మదాబాద్ విమాన ప్రమాదం హృదయ విదారకమని చెప్పాలి. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయినా కొన్ని నిమిషాలకే ఒక భవంతి పై విమానం కూలిపోవడంతో సుమారు 265 మంది వరకు మరణించారని తెలుస్తుంది. ఈ విమాన ప్రమాదంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ ప్రమాద సమయంలో ఈయన విమానం నుంచి బయటకు దూకడం వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలియజేశారు.

ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా విమాన ప్రమాదం జరుగుతుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గతంలో తెలియచేసినట్టు ఒక వీడియో ప్రస్తుతం సంచలనగా మారింది. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నిత్యం సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ ఈయన వార్తలలో నిలుస్తున్నారు.

ఇకపోతే తాజాగా విమాన ప్రమాదం గురించి ఈయన ముందుగానే హెచ్చరించారని ఒక వీడియోని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. 2025 ఉగాది పండుగను పురస్కరించుకొని వేణు స్వామి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పంచాంగ శ్రవణం చెప్పారు. అయితే ఈ ఏడాది ఎక్కువగా విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు కూడా జరుగుతాయని వేణు స్వామి తెలిపారు. ఇక ప్రకృతి పరంగా భూకంపాలు అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పినటువంటి వీడియోలు ప్రస్తుత సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.. ఇక ఈయన చెప్పిన విధంగానే భారీ విమాన ప్రమాదం చోటు చేసుకోవడంతో వేణు స్వామి జ్యోతిష్యం నిజమైంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.