Suchitra Krishnamoorthi: అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుడిపై మండిపడిన నటి.. పిచ్చి హాస్పిటల్ లో చేర్పించాలంటూ!

Suchitra Krishnamoorthi: ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిసి వేసింది. దాదాపుగా 265 మందికి పైగా ఈ ప్రమాదంలో మరణించడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఈ ఘటన గురించి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఆ ప్రమాదం నుంచి ఒక అతను ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. అతను మరెవరో కాదు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్. అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతో సంఘటన స్థలం నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చాడు.

అయితే అతడు బయటికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ తర్వాత మీడియాతో మాట్లాడడంతో అతని మృత్యుంజయుడుగా పిలుస్తూ చాలా అదృష్టవంతుడు భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అంటూ చాలా రకాల కామెంట్లు వినిపించిన విషయం తెలిసిందే. అలా అతని గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు కూడా వినిపించాయి. అతను మీడియాతో మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది విశ్వాస్ అబద్ధం చెబుతున్నాడు అంటూ పుకార్లు సృష్టిస్తూ కామెంట్లు కూడా చేయడంతో అది నమ్మిన ఒక సింగర్ ఇప్పుడు సంచలన ట్వీట్ చేసి కాంట్రవర్సీలో నిలిచింది.

ఈ మేరకు ఆమె అతని గురించి స్పందిస్తూ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. రమేశ్‌ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అంటూ ట్వీట్‌ చేసింది.ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్‌ లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర వెంటనే ట్వీట్‌ ను డిలీట్‌ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. సుచిత్ర చేసిన ట్వీట్ పై మండిపడుతూ ఆమెపై రోల్స్ చేస్తున్నారు నైటిజన్స్..