Sankranthiki Vasthunnam: నిజామాబాద్‌లో వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?

Sankranthiki Vasthunnam: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికీ తెలిసిందే. వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో బాగానే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

అందరిలా కాకుండా ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కాస్త విన్నూత్నంగా చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదలైన పాటలు టీజర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ విషయంపై అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 6వ తేదీన అనగా సోమవారం రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లో నిర్వహించనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 

క‌లెక్ట‌ర్ గ్రౌండ్ లో గ్రాండ్‌గా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాలో కామెడీ భారీగా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రమోషన్స్ వీడియోలని బట్టి చూస్తే ఈ సినిమాలో కామెడీ పీక్స్ లో ఉంటుందని అర్థం అవుతుంది. ఈ సినిమాలో కామెడీ ఎఫ్2 ఎఫ్3 సినిమాలను మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.