టాలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజుకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రానికి భారీ నష్టం రావడం ఖాయం అయ్యింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, దాదాపు రూ. 100 కోట్లకు పైగా నష్టాన్ని చూసిన దిల్ రాజు, ఇదే సమయంలో మరొక ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేశారు.
విజయవంతమైన సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని, వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. పండుగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా ప్రాఫిట్ ను వసూలు చేసి, గేమ్ ఛేంజర్లో వచ్చిన నష్టాన్ని పాక్షికంగా పూడ్చేసింది.
ఈ పరిణామాలు దిల్ రాజు వ్యూహాత్మక ఆలోచనలకు ఉదాహరణగా నిలిచాయి. ఒక సినిమా భారీ బడ్జెట్ పెట్టి నష్టాలను చవి చూసినా, మరో సినిమాతో అదే సమయానికి లాభాలు తీసుకురావడం అతని వ్యాపార నైపుణ్యాన్ని రుజువు చేసింది. మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసే సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది.
దిల్ రాజు కెరీర్‌లో చిన్న సినిమాలే ఎక్కువగా లాభాలు ఇచ్చినట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేశాయి. భారీ బడ్జెట్ సినిమాలకు మార్కెట్ అనుకూలించకపోతే నష్టాలు తప్పవని, అదే చిన్న సినిమాలతో మంచి కంటెంట్ ఉంటే లాభాలు తధ్యం అని సంక్రాంతి బరిలో ఆయన విజయంతో మరోసారి తెలుస్తోంది.