Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం నిద్రపోయే ముందు ఈ వస్తువులు పొరపాటున కూడా మన దరిదాపుల్లో ఉండకూడదు?

Vastu Tips: సాధారణంగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వాస్తును ఎంతగానో నమ్ముతూ ఉంటారు.ఈ క్రమంలోనే మనం పడుకునే పద్ధతిలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని ఇలాంటి నియమాలను పాటించినప్పుడే ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలమని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మనం నిద్రపోయే విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని ముఖ్యంగా మన నిద్రపోతున్న సమయంలో కొన్ని వస్తువులు మన దరిదాపుల్లోకి కూడా ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే…

పర్సు: మనం నిద్ర పోయేటప్పుడు పొరపాటున కూడా మన దరిదాపుల్లో పర్సు ఉండకుండా చూసుకోవాలి. ఇలా పర్స్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు మన తలలో పర్సు మన దగ్గరే ఉంది అందులో డబ్బులు ఉన్నాయని భావన ఉండటం వల్ల మనకు ఏ మాత్రం శాంతి కలగకుండా ఉంటుంది అందుకోసమే మనం పడుకున్న సమయంలో పర్స్ ఉండకూడదు.

పుస్తకాలు: సాధారణంగా చాలా మంది పడుకునే సమయంలో పుస్తకాలు లేదా వార్తాపత్రికలు పక్కన పెట్టుకుని నిద్రపోతుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల సరస్వతీ దేవిని అవమానించినట్లే అని పలువురు నిపుణులు వెల్లడించారు.అందుకోసమే మనం పడుకునే సమయంలో మన పరిసరాలలో పుస్తకాలు ఉండకూడదు.

మొబైల్ ఫోన్: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరికి నిద్రపట్టడం లేదు కానీ పడుకునే సమయంలో మన సెల్ ఫోన్ పక్కన ఉండటం కొన్ని అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని అందుకే నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ పక్కన ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

చెప్పులు: ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. అయితే ఇలా నడవడం పరమ దరిద్రం. ఇలా నడవడమే కాకుండా చాలా మంది వారి పడక గదిలో మంచం కింద చెప్పులు వదిలి నిద్రపోతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా నిద్ర పోకూడదని ఇలా నిద్ర పోవడం అశుభం అని పండితులు చెబుతున్నారు.