అదిరిపోయే లెవెల్లో మరింత క్లారిటీ గా భారీ ఏక్షన్ డ్రామా “వలిమై” తెలుగు ట్రైలర్!

మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఎలాగో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో థలా అజిత్ మరియు థలపతి విజయ్ లు కూడా అంతే. వీరి సినిమాలు వస్తున్నాయి అంటే సోషల్ మీడియా నుంచి థియేటర్స్ వరకు భారీ రికార్డ్స్ నమోదు అవ్వాల్సిందే.. మరి ఇపుడు ఈ నలుగురి హీరోలు కూడా తమ మార్కెట్ ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు.

అలా అజిత్ కుమార్ నటించిన తన లేటెస్ట్ సినిమా “వలిమై” ని తెలుగు సహా మరిన్ని భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సిద్ధం కాగా దాని తాలూకా ట్రైలర్ ని తెలుగులో రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం నుండి అప్పుడు తెలుగు ట్రైలర్ రాగా చాలామంది మనవాళ్ళకి అర్థం కాకపోవచ్చు.

కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదగా రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. అయితే ఈ చిత్రంలో ఒక స్పెషల్ ఆఫీసర్ గా లిమిటెడ్ పవర్స్ తో అజిత్ పాత్ర కనిపిస్తుండగా మన తెలుగు నటుడు కార్తికేయ డబ్బు, గెలుపు ఎలా వచ్చింది అని కాదు వచ్చిందా లేదా అనే పాయింట్ తో ఉంటాడు. మరి అదే పవర్ పరులని కాపాడటానికి మాత్రమే ఉపయోగించాలి అని సిద్ధాంతం ఉన్న ఈ ఇద్దరు కూడా ఎదురైతే?

Valimai Trailer | Telugu | Ajith Kumar | Kartikeya | Yuvan Shankar Raja | H Vinoth | 24 Feb

 

వాళ్ళ మధ్య యుద్ధం మరింత కఠినం అయితే ఎలా ఉంటుంది అనేదే ఈ ఏక్షన్ డ్రామా నేపథ్యం అన్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే ఫ్యామిలి ఎమోషన్ కూడా బాగా కనిపిస్తుంది. మరోపక్క భారీ ఏక్షన్ సీక్వెన్స్ లు కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఎందుకో సినిమాలో మరింత ట్రీట్ ఇస్తాయి అనిపిస్తుంది. కానీ యువన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఈ ట్రైలర్ లో అంతగా బాగలేదు. సినిమాలో కూడా ఇలాగే ఉంటే కష్టమే అని చెప్పాలి. కానీ మొత్తంగా చూస్తే ఏక్షన్ మూవీ లవర్స్ కి వలిమై గట్టి ట్రీట్ నే ఇచ్చేలా అనిపిస్తుంది. మరి వచ్చే 25న విడుదల అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.