RRR : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “వకీల్ సాబ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో కం బ్యాక్ సినిమాగా వచ్చింది. అయితే మూడు సంవత్సరాల తర్వాత పవన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూసారు.
మరి వాటికి తగ్గట్టుగా నిర్మాత దిల్ రాజు అదిరే ప్లానింగ్స్ కూడా చేసాడు. అయితే వాటిలో ట్రైలర్ ని నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేయించడం ఒకటి. మరి ఈ వకీల్ సాబ్ దెబ్బ ఇప్పుడు రానున్న భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ట్రైలర్ లాంచ్ కి మళ్ళీ గుర్తొచ్చింది. మరి ఈ అసలు కథ ఏమిటంటే సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతుంది.
వైజాగ్ కి చెందిన ప్రముఖ థియేటర్స్ వారు తమకి ‘RRR’ ట్రైలర్ షో వేసే సమయంకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరుతూ వైజాగ్ ఏసీపీ కి ఒక లేఖ రాయడం ఆసక్తిగా మారింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని అందుకే మా థియేటర్ కి రక్షణ కావాలని కోరారు.
ఇదెందుకు అంటే గతంలో పవన్ వకీల్ సాబ్ ట్రైలర్ లాంచ్ కి పవన్ అభిమానులు అద్దాలు పగలగొట్టుకొని మరీ ఈ థియేటర్ లోకి దూసుకెళ్లారు. అందుకే ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎదురవ్వొచ్చు అని జాగ్రత్తపడి పోలీసులని ఆశ్రయించారు.