బాధ్యతంతా పవన్ కళ్యాణ్‌దే ‘బ్రో’.!

సాధారణంగా పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాల్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోరు. తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ రూటే సెపరేటు. బిజీ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా, ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చన్న ప్రచారం జరిగింది. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలతో పోల్చితే, ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సమ్‌థింగ్ డిఫరెంట్.

నిజానికి, ‘బ్రో’ సాయి ధరమ్ తేజ్ సినిమా. కానీ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఎక్కువ ఫీల్ అవుతాం. అలా, ఆ పాత్రని మలిచేలా.. తన సూచనల్ని, త్రివిక్రమ్‌కి అందించారు జనసేనాని. దాన్ని సముద్రఖని ద్వారా ఎగ్జిక్యూట్ చేయించారు.

సినిమా రిలీజ్ అయ్యాక, డివైడ్ టాక్ కొనసాగుతోంది. వసూళ్ళ ప్రభంజనమంటారు కొందరు. వసూళ్ళు తేలిపోయాయంటారు ఇంకొందరు. నిర్మాత మాత్రం హ్యాపీ. ‘ఏం జరిగినా బాధ్యత నాది’ అంటూ బాధ్యతంతా పవన్ కళ్యాణ్ తీసుకున్నారట మరి.! పోస్ట్ రిలీజ్ మూవీ ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించకపోయినా, ఆయన సూచనల మేరకే అన్నీ జరుగుతున్నాయట.