వైష్ణవ్ తేజ్, రొటీన్ కమర్షియల్ హీరో కానే కాదు.!

‘ఉప్పెన’ సినిమాని ఎంచుకోవడంతోనే పంజా వైష్ణవ్ తేజ్ రొటీన్ కమర్షియల్ హీరో కాదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమయ్యింది. తొలి సినిమాతో మాంఛి కమర్షియల్ ఎంచుకునే అవకాశం వున్నా, ‘ఉప్పెన’ వైపు మొగ్గు చూపాడంటేనే, అతనికి కథల ఎంపిక పట్ల వున్న ప్రత్యేకమైన ఆసక్తి ఏంటో అర్థమవుతుంది.
తొలి సినిమా కదా, బహుశా అతనికి ఆ అవకాశం వుండి వుండకపోవచ్చని కొందరు అభిప్రాయపడొచ్చుగాక. కానీ, రెండో సినిమా ‘కొండపొలం’ విషయంలో వైష్ణవ్ తీసుకున్న టర్న్.. ఆయన్ని వెరీ వెరీ స్పెషల్ నటుడిగా మార్చేసింది. వాస్తవానికి ‘కొండపొలం’ ప్రోమో వచ్చాక, వైష్ణవ్ బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాడనే విమర్శలొచ్చాయి.

ఎప్పుడైతే ‘కొండపొలం’ సినిమా విడుదలైందో, వైష్ణవ్ నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడటం మొదలు పెట్టారు. సినిమా కమర్షియల్ విజయం ఎంతవరకు అందుకుంటుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నటుడిగా అతన్ని ఖచ్చితంగా ఓ మెట్టు పైకెక్కిస్తుందని చెప్పొచ్చు.
‘ఔను, వైష్ణవ్ సాధారణ నటుడు కాదు, అంతకు మించి. అతనితో ప్రయోగాత్మక చిత్రాలు చేయొచ్చు..’ అంటూ సినీ పరిశ్రమలో పలువురు క్రియేటివ్ డైరెక్టర్ష్, ‘కొండపొలం’ సినిమా విడుదలయ్యాక చర్చించుకుంటున్నారు. సో, నటుడిగా మెగా కాంపౌండ్ నుంచి మరో ఆణిముత్యం వచ్చిందని అనుకోవచ్చేమో.