ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎంకు ఛాతీలో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు ఎయిమ్స్ వర్గాలు నిర్ధారించాయి. రావత్ కు ఛాతీలో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు ఎయిమ్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు.
కాగా, ఈనెల 18న సీఎం రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆయనకు జ్వరంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి నేడు ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు.
ఇక కేబినెట్ భేటీలో పాల్గొన్న మంత్రి సాత్పాల్ మహరాజ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో జూన్ 1న ఓసారి క్వారంటైన్‌కు వెళ్లిన సీఎం, తన కార్యాలయంలో పనిచేసే ఓఎస్‌డీకి కరోనా సోకడంతో ఆగస్టు 26న మరోసారి ఐసోలేషన్ కు వెళ్లారు. కానీ నిన్నటి నుండి ఆయనకు జ్వరంగా ఉండటంతో నిన్న సాయంత్రం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు చాతిలో ఇన్ఫెక్షన్ ఉండడంతో అక్కడ వైద్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. దీంతో ఆయన అక్కడి నుండి స్పెషల్ చాపర్ లో ఢిల్లీ వచ్చి ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు.