మెగా కాంపౌండ్‌లో క‌రోనా క‌ల్లోలం.. నాకు వచ్చే అవ‌కాశాలున్నాయంటున్న ఉపాస‌న‌

క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తున్న స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది పోయి పార్టీలు, పెళ్లిళ్లు, విహార యాత్ర‌లంటూ తిరిగితే అందుకు త‌గ్గ మూల్యం తప్ప‌క చెల్లించుకోవ‌ల్సి రావ‌డం ఖాయం. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌నే మ‌న మెగా కుటుంబం. డిసెంబ‌ర్ 9న మెగా ఫ్యామిలీ అంతా నిహారిక పెళ్ళిలో తెగ సంద‌డి చేసింది. డ్యాన్స్ లు, పాటలు అంటూ తెగ ర‌చ్చ చేశారు. ఈ వేడుక‌లో ఎవ‌రు కరోనా జాగ్ర‌త్త‌లు పాటించ‌లేదు. అదృష్ట‌వ‌శాత్తు ఎవ‌రు క‌రోనా బారిన ప‌డ‌లేదు. ఇక పెళ్ళి త‌ర్వాత మెగా ఫ్యామిలీ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. నిహారిక బ‌ర్త్ డే వేడుక‌, క్రిస్మ‌స్ వేడుక అంటూ నానా హంగామా చేశారు.

డిసెంబ‌ర్ 24 రాత్రి రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు మెగా ఫ్యామిలీ స‌భ్యుల‌కు క్రిస్మ‌స్ సంద‌ర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుక‌కు అల్లు అర్జున్ దంప‌తులు, సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నిహారిక దంప‌తులు, శ్రీజ దంప‌తులు, సుస్మిత దంప‌తులు హాజ‌ర‌య్యారు. వీరంద‌రు మాస్క్‌లు భౌతిక దూరం ఏవి పాటించ‌కుండా ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఈ పార్టీ జ‌రిగిన స‌రిగ్గా నాలుగు రోజుల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న‌ని క‌లిసిన వారంద‌రిలో గుబులు మొద‌లైంది. రామ్ చ‌ర‌ణ్ నిన్న ఉద‌యం త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని చెబితే సాయంత్రం వ‌రుణ్ తేజ్ త‌న‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని అన్నారు.

తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ శ్రీమ‌తి ఉపాస‌న కూడా త‌నకు క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి అంటూ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొంది. నేను టెస్ట్ చేయించుకున్నాను, నెగెటివ్ వ‌చ్చింది. కాని పాజిటివ్ వ‌చ్చే ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం నేను క్వారంటైన్‌లోనే ఉన్నాను. ఆవిరి ప‌ట్ట‌డం, వేడి నీళ్ళు తాగ‌డం వంటి చేస్తూ చ‌ర‌ణ్‌తో హోం క్వాంర‌టైన్‌లో ఉన్నాను. చరణ్ కు ఎలాంటి లక్షణాలు లేవు అతను స్ట్రాంగ్ గానే ఉన్నాడంటూ ఉప్సీ తెలిపింది. మ‌రి రానున్న రోజుల‌లో మిగ‌తా హీరోలు ఏం చెబుతారో చూడాలి.