Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే మొదటి సినిమాతోనే ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ-4 వంటి తదితర చిత్రాల్లో నటించింది. నటిగా, మోడల్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.2017 వ సంవత్సరంలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న ఇమేజ్ 2021 సంవత్సరంలో ఇజ్రాయిల్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఇజ్రాయిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో పూర్తికాగానే ఈ బ్యూటీ తిరిగి ఇండియాకు చేరుకుంది.ఈ క్రమంలోనే ఈ పింక్ కలర్ డ్రెస్సులో ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కడంతో కెమెరాలు ఈమెను క్లిక్ మనిపించాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈమె ధరించిన డ్రెస్ గురించి చర్చ మొదలు పెట్టారు. పింక్ కలర్ డ్రెస్సులోమెరిసిపోతున్న ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ ఖరీదు తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే.
ఈ బామ ధరించిన ఈ గులాబీ రంగు డ్రెస్ అక్షరాల ఐదు లక్షల రూపాయలు .ఈ డ్రెస్ ఇంత ఖరీదు చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఈ డ్రెస్ లో వజ్రాలు పొదిగి ఉండడంతో ఈ డ్రెస్ ఇంత ఖరీదు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈమె ధరించిన చెవి దుద్దులు కూడా వజ్రాలు కావడంతో ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో భారత్‌కు చెందిన హర్నాజ్ సంధూ కిరీటాన్ని గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే.