ఉప్పెన ట్విట్ట‌ర్ రివ్యూ.. నెటిజ‌న్స్ ఏమంటున్నారంటే..!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ , అందాల భామ కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా, ప్రేక్ష‌కుల మదిలో ఎప్ప‌టికి నిలిచేలా ఉప్పెన చిత్రాన్ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలే పెంచాయి. మ‌రోవైపు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రావ‌డం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు కురిపించ‌డం, ఇండ‌స్ట్రీకు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం అని ట్వీట్స్ చేయ‌డంతో మూవీ పై అంచ‌నాలు భారీగా పెరిగాయి.

నేడు ఈ చిత్రం భారీ స్థాయిలో విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ఎలా ఉంద‌నే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. యూఎస్ ప్రీమియర్ షోస్ తో పాటు కొన్నిచోట్ల బెనిఫిట్ షోస్ ప్ర‌ద‌ర్శించ‌డంతో ట్విట్ట‌రియ‌న్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా మూవీ ఎలా ఉంద‌నే దానిపై అప్‌డేట్స్ ఇస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్ అదిరిపోయింద‌ని, కృతి శెట్టి క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెష‌న్స్ , పెర్ఫామెన్స్ యూత్‌ని మైమరపించేట్టుగానే ఉన్నాయ‌ని చెబుతున్నారు. వైష్ణ‌వ్ తేజ్‌కు ఈ సినిమా తొలి మూఈ అయిన‌ప్ప‌టికీ చాలా ఎక్స్‌పీరియెన్స్ ఆర్టిస్ట్ మాదిరిగా న‌టించాడ‌ని అంటున్నారు. కొంద‌రేమో గురువును మించిన శిష్యుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఉప్పెన సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వ‌స్తున్న‌ప్ప‌టికీ, కొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేయ‌డం షాకింగ్‌గా మారింది. మరాఠీలో వచ్చిన ‘సైరత్’ మూవీకి కాపీ పేస్ట్‌లా ఉంద‌ని కొంద‌రు అంటుండ‌గా, ఇంకొంద‌రు కలర్ ఫోటో సినిమాను గుర్తుకు తెస్తున్నారని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు విడుద‌ల కాక‌పోయి ఉంటే ఉప్పెన హిట్ అయ్యేద‌ని జోస్యాలు చెబుతున్నారు. ఏదేమైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం ఖాయమ‌ని చెబుతున్నారు. ఇప్పుడు అంత‌టా క్లైమాక్స్ సీన్ గురించి చ‌ర్చ న‌డుస్తుంది. సినిమాను చూసిన వారంతా.. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా ఉన్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు డిస్సాపాయింట్ అవుతారని మరి కొంద‌రు చెబుతున్నారు.