చిరంజీవితో క‌లిసి సంతోషాన్ని పంచుకున్న ఉప్పెన టీం.. పిక్స్ వైర‌ల్‌

ఊహించ‌ని విజ‌యం సాధించ‌డంతో ఉప్పెన చిత్ర బృందం ఫుల్ ఖుష్ అవుతుంది. కొత్త ద‌ర్శ‌కుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ఉప్పెన కురిపిస్తుండ‌డంతో చిత్ర బృందం ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆస‌క్తిక‌ర పాయింట్‌తో అద్భుతంగా సినిమాని తెర‌కెక్కించిన బుచ్చిబాబును ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు. అలానే చిత్ర కథానాయ‌కుడు, క‌థానాయిక కృతి శెట్టి చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న న‌టులుగా న‌టించారు. విజ‌య్ సేతుప‌తి నెగెటివ్ షేడ్ లో అద‌ర‌గొట్టారు.


ఉప్పెన చిత్రానికి కలెక్షన్లు కూడా ఉప్పెనలాగే వస్తున్నాయి. తొలిరోజు రూ.10. 42 కోట్ల షేర్ రాబట్టి.. డెబ్యూ చిత్రంతో అత్యధిక వసూల్లు రాబట్టిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఇక రెండో రోజు కూడా క‌లెక్ష‌న్స్ బాగానే వ‌చ్చాయి.య‌ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు ఉప్పెన చిత్రం 17. 77 కోట్లు షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్‌కి దగ్గరైంది. ఇందులో నైజాం+ ఏపీ రూ.16. 7.3 కోట్లు రావడం విశేషం. కాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ 22 కోట్ల షేర్ కాగా.. మూడు రోజు ఆ మొత్తాన్ని బ్రేక్ చేసిన‌ట్టు స‌మాచారం.

‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా రూ.20.50 కోట్లకు విక్రయించగా.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లు కాగా.. మొత్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓ డెబ్యూ హీరో సినిమాకు మూడు రోజుల‌లో 22 కోట్ల షేర్ వ‌సూలు చేసిందంటే మాములు విష‌యం కాదు. ఈ సంతోషాన్ని చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవిని క‌లిసి పంచుకుంది. రామ్ చ‌ర‌ణ్‌,చిరంజీవిని క‌లిసిన ఉప్పెన టీం వారితో ఫొటో దిగ‌గా ఆ పిక్ వైర‌ల్‌గా మారింది.