బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ఉప్పెన‌.. రెండో రోజు భారీ క‌లెక్ష‌న్స్

మెగా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన యువ హీరో వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తొలి రోజు ప‌ది కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి ఈ చిత్రం రెండో రోజు కూడా భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి అంద‌రు నోరెళ్ళ పెట్టేలా చేస్తుంది. డెబ్యూ హీరో సినిమాకు ఈ రేంజ్ ఆద‌ర‌ణ ద‌క్క‌డం ప‌ట్ల ట్రేడ్ పండితులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబ‌ట్టిన ఉప్పెన నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబ‌ట్టింది. డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు వైష్ణ‌వ్ తేజ్.

uppena telugu movie review
uppena telugu movie review

ఉప్పెన చిత్రం రెండవ రోజు కూడా భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజుల‌కు గాను 18.77 కోట్లు రాబ‌ట్ట‌గా, తెలంగాణ మ‌రియు ఏపీల‌లో క‌లిపి 16.73 కొట్లు వ‌సూలు చేసింది. నిజాంలో ఈ చిత్రం 5.75 కోట్లు, వైజాగ్ 2.67 కోట్లు, ఈస్ట్ 1.63 కోట్లు, వెస్ట్ 1.13 కోట్లు, కృష్ణ 1.10 కోటి, గుంటూరు 1.42 కోట్లు, నెల్లూరు 0.58 కోట్లు, సీడెడ్ 2.45 కోట్లు, ఓవ‌ర్సీస్ 70 ల‌క్ష‌లు, కర్ణాట‌ల‌క 86 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు 30 ల‌క్ష‌లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 18 ల‌క్ష‌ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఇక ఈ రోజు ఆదివారం కావ‌డంతో పాటు వేలంటైన్స్ డే రావ‌డంతో మూవీ మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని అంటున్నారు.

ఈ రోజు ఉప్పెన చిత్రం ప‌క్కా మైల్ స్టోన్ దాటుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. హీరో,ద‌ర్శ‌కుడు, హీరోయిన్ ఈ సినిమాకు కొత్త వారే అయినప్పటికీ త‌మ పనిని స‌క్ర‌మంగా పూర్తి చేశారు. ఈ క్ర‌మంలోనే ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. మ‌క్క‌ల్ సెల్వన్ విజ‌య్ సేతుప‌తి న‌ట‌న ఈ సినిమాకు మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అని చెప్పాలి. ఏదేమైన గ‌తంలో ఏ టాలీవుడ్ డెబ్యూ హీరో సాధించని ఘ‌న‌త‌ను వైష్ణ‌వ్ తేజ్ సాధించ‌డం గ్రేట్ అనే చెప్పాలి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమ‌ణి రాసిన‌ ‘నీ క‌న్ను నీలి సముద్రం’ పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మ‌రింత విజయాన్ని తెచ్చి పెట్టడంలో కృషి చేసింది.