ప్రముఖ వైద్య సంస్థ అపోలో హాస్పిటల్స్వైస్ ఛైర్ పర్సన్, మెగా స్టార్ట్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్స్ కి ఏమాత్రం తీసిపోకుండా మంచి గుర్తింపు పొందింది. మూగజీవాల పట్ల ఉపాసన కి ఉన్న ఇష్టం గురించి అందరికీ తెలిసిన విషయమే. వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, జీవ రాసుల పోషణ కోసం ఉపాసన తన సొంత డబ్బుతో పాటు తన అమూల్యమైన సమయాన్ని కూడ కేటాయిస్తూ వాటి సంరక్షణకు ఎంతో కృషి చేస్తోంది. అయితే ఇటీవల ఉపాసన మరొకసారి తన మంచి మనసు చాటుకున్నారు.
ఉపాసన wwfతో కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న ఫారెస్ట్ గార్డులతో పాటు వన్యప్రాణి సంరక్షణ కోసం పని చేసే వారికి తమ అపోలో హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో ఉచితంగా వైద్య సదుపాయాలు అందించడానికి తమ వంతు కృషి అందిస్తామని ఉపాసన తెలియచేశారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పని చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోని వేర్వేరు శాఖలకు చెందిన ఉద్యోగుల సంబందించిన వైద్యసేవలను తాము చూసుకుంటామని ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా ఉపాసన షేర్ చేశారు.
అటవీ ప్రాంతాలలో విధులు నిర్వహించే ఫారెస్ట్ రేంజర్ల కు మనుషుల వల్ల కానీ వన్యప్రాణుల వల్ల కానీ ఏమైనా ప్రమాదం జరిగితే వారికి అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తామని ఈ ఒప్పంద పత్రాలలో ఉంది. అంతే కాకుండా ఏదైనా అటవీ సంబంధిత రుగ్మతల బారిన పడ్డ వారికి అపోలో హాస్పిటల్స్ తరపున ఉచిత వైద్యసేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఉపాసన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఉపాసన మూగజీవాల సంరక్షణ కోసం పాటుపడుతూ డబ్లూడబ్లూఎఫ్‌తో కలిసి పని చేస్తున్నారు. అంతే కాకుండా ఫారెస్ట్ ఫ్రంట్‌లైన్ హీరోస్ డబ్లూడబ్లూఎఫ్ ఇండియాకు ఉపాసన బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు.