Unstoppable With NBK: ఒకే తెరపై సందడి చేయనున్న ప్రభాస్.. బాలయ్య.. అభిమానులకు పండగే పండగ..?

Unstoppable With NBK: నందమూరి నటసింహం ప్రస్తుతం ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యి ఎన్నో విశేషాలను అభిమానులకు వెల్లడించారు. ఆహా వేదికగా ప్రసారమౌతున్న ఈ కార్యక్రమానికి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటోంది అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా వచ్చే నెల 14వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావాలని నిర్మాత అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రభాస్ కనుక ఈ కార్యక్రమానికి వస్తే ఇటు ప్రభాస్ అభిమానులకు అటు నందమూరి అభిమానులకు పండగే పండుగ అని చెప్పవచ్చు.

సాధారణంగా ప్రభాస్ కేవలం తన సినిమాల వరకు మాత్రమే ఆసక్తి కనబరుస్తారు కానీ ఇలాంటి టీవీ షో లో పెద్దగా కనిపించడానికి ఆసక్తి చూపించరు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ప్రభాస్ ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనలేదని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి కూడా ప్రభాస్ ను ఆహ్వానించగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభాస్ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. మరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని కైనా ప్రభాస్ వస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.