సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం.. చెన్నై చిత్తు!

Virender Sehwag comments on sunrisers hyderabad

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో 8 స్థానంలో నిలించింది. చెన్నై విదించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 10 మ్యాచుల్లో కనీసం 8 మ్యాచుల్లో గెలిస్తేనే సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.