Actress Sudha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా బాధలు తెలిస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే..?

Actress Sudha: సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారి జీవితాలు ఎంతో విలాసవంతంగా, ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ముమ్మాటికీ పొరపాటే.. ఎందుకంటే పైకి నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల వెనుక కన్నీళ్లు పెట్టించే బాధలు కూడా దాగి ఉంటాయి. కొంత మంది సెలబ్రిటీలు వారికి ఎన్ని బాధలు ఉన్నా వాటిని బయటకు చెప్పకుండ నవ్వుతూ, ప్రేక్షకులను నవ్విస్తూ నటిస్తూ ఉంటారు. ఇకపోతే అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా కూడా ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సుధ జీవితంలో ఎదురైన ఇబ్బందులు, బాధలు, పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది.

14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధ ఆ తర్వాత మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఆ తరువాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో, అక్క, పిన్ని,వదిన ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుధా చేయని పాత్ర లేదు అని చెప్పవచ్చు. ఒక ఇంటర్వ్యూలో సుధా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ ద్వారా ఎంతో సంపాదించుకున్నాను.. కానీ ఆ సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా బిజినెస్ పెట్టి అంతా పోగొట్టుకున్నాను.. ఢిల్లీలో ఒక హోటల్ పెట్టినప్పుడు లాభాలు బాగానే వచ్చాయి.. దీనితో మరొక హోటల్ కూడా స్టార్ట్ చేశాను. ఆ హోటల్ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చి నిండా మునిగి పోయాను అని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆమె తన కుటుంబ సభ్యులు చెన్నైకి మారారట. ఆమె భర్త కొడుకు ఆమెకు దూరంగా ఉంటూ యూఎస్ఏ లో ఉన్నారట. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో, అన్నలు ఉన్నవాళ్లు ఉన్నాకూడా ఆమెకు, తన తండ్రికి అండగా నిలవక పోవడంతో తన తండ్రి బాధ్యత కూడా తానే చూసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే సుధా నాన్నకు ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ క్యాన్సర్ కారణంగా అన్ని కరిగిపోయాయట.అయితే సుధ తన అమ్మ చనిపోయినప్పుడు అంత బాధ పడలేదు కానీ తండ్రి చనిపోయిన తర్వాత ఆమెకు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చిందట. ఆ తర్వాత ఇన్నేళ్ల జీవితం లో మనుషులనే నమ్మకూడదు అని అర్థం చేసుకున్న అని చెప్పుకొచ్చింది. కష్ట సమయాల్లో బంధువులు కూడా దూరం పెట్టారనీ, అలాంటి సమయాల్లోనే ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని, తన పరిస్థితులు అన్నీ మాతృ దేవత సినిమాలోని సన్నివేశాల లాగే ఉంటాయి అని ఆమె చెప్పుకొచ్చింది.