ఉండవల్లి పురాణం.. ఏంటీ మేధావితనం.!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ‘మేధావి’ ముద్ర వేసేసుకున్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఆయనా ఒకరు. మంచి మాటకారి కావడంతో, ఉండవల్లి మాట్లాడే మాటలకు మీడియాలో స్పెషల్ ఫోకస్ లభిస్తుంటుంది.

‘పెయిడ్ ఆర్టిస్ట్’ అన్న పదానికి నిలువెత్తు నిర్వచనంలా ఉండవల్లి అరుణ్ కుమార్‌ని అభివర్ణిస్తుంటారు రాజకీయాల్లో. సరే, ఎవరికి అవసరమైన రీతిలో వారికి అనుకూలంగా ఉండవల్లి మాట్లాడటం ఇదే కొత్త కాదనుకోండి.. అది వేరే సంగతి. ఓ సారి వైఎస్సార్‌ని పొగుడుతారు.. ఇంకోసారి అదే వైఎస్సార్ మీద సూటిపోటి విమర్శలు చేస్తుంటారు.

ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పొగడ్తలు, తెగడ్తల సంగతి సరే సరి. చంద్రబాబు విషయంలో అయినాసరే, వుండవల్లి డబుల్ టంగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఉండవల్లి ఇంకోసారి మీడియా ముందుకొచ్చి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, చంద్రబాబు ఏడుపు మీదా తనదైన స్టయిల్లో వ్యాఖ్యలు చేసేశారు.. అభిప్రాయాలు వ్యక్తం చేసేశారు.

అసలు రాష్ట్రం ఇలా నాశనమవడానికి ప్రధాన కారణం ఎవరు.? కాంగ్రెస్ పార్టీనే. అప్పట్లో కాంగ్రెస్ నేతగా వున్న ఉండవల్లి సమైక్య ఉద్యమంలో పలికిన ప్రగల్భాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఏం జరిగింది.? కాంగ్రెస్ మీద విమర్శలు చేసి, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి, రాజకీయంగా దాదాపు ‘సన్యాసం’ పుచ్చేసుకున్నారు.

ఆ తర్వాతి నుంచే, ఇదిగో వీలు చిక్కినప్పుడల్లా ‘పెయిడ్ ఆర్టిస్టు’ తరహాలో మేధావితనం చాటుకుంటుంటారు. వీళ్ళ మాటలకి ఇంకా విలువ వుందా.? అన్నదే అసలు చర్చ.