AP: జగన్మోహన్ రెడ్డి ఏపీలో తన పార్టీని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే సీనియర్ కాంగ్రెస్ నాయకులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనిచేసిన ఎమ్మెల్యేలు మాత్రులను ఈయన తిరిగి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు.
ఇలా ఒకవైపు వైసీపీ పార్టీ నుంచి వలసలుగా బయటకు వెళ్తున్నప్పటికీ జగన్ మాత్రం మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే సింగనమల మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైయస్ జగన్ హయాలో పార్టీ కండువా కప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇదే బాటలోనే మరి కొంతమంది కూడా రాబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల విజయ్ సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పకుండా విషయం మనకు తెలిసిందే. వైసీపీలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఈయన రాజకీయాల నుంచి తప్పుకోవటంతో ఆయన స్థానాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది.
వైయస్సార్ హయామంలో ఈయన ఎంపీగా కొనసాగారు అయితే విభజన బిల్లుకు వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ ఈయనని సస్పెండ్ చేసింది అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఉండవల్లి అనంతరం జగన్ కి మద్దతు తెలిపారు అయితే తరువాత జగన్ పట్ల విమర్శించిన ప్రస్తుతం మాత్రం జగన్ గురించి పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తుంది. అయితే ఈయన కూడా తిరిగి వైసిపి చెంతకు చేరబోతున్నారట వార్తలు వస్తున్నాయి.
ఉండవల్లి ఈ నెల 26 తరువాత వైసీపీలో చేరుతారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. కానీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి నిజంగా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.