సీఎం జగన్‌తో కలిసి బ్రహ్మోత్సవాల్లో తిరిగిన ఇద్దరి మంత్రులకి కరోనా…

Two minister have korona possitive

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తోంది.ప్రజలు, అధికారులు ,ఉద్యోగులు ,చివరికి మంత్రులకి కూడా వైరస్ పలకరించి పోతుంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకింది. తాజాగా, సోమవారం ఒక్క రోజే ఏపీలో మరో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా సోకగా, మధ్యాహ్నం మంత్రి వేణుగోపాలకృష్ణకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్న, కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే కొందరు నేతలు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.

Two minister have korona possitive
Two more ministers are corona possitive

మంత్రి వేణుగోపాల్‌ గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంటే మంత్రి ఉన్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు.

అలాగే ఆదివారం జరిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రథం నిర్మాణం కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి ధర్మాన మీడియా మీట్ కూడా నిర్వహించారు. ఈ మీట్‌లో వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. మంత్రికి పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు.

Two minister have korona possitive
Two more ministers have korona possitive

మరోవైపు, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.