Gallery

Home News Gum Bottle: ఆ అమ్మాయి ట్వీట్ తో జ్ఞాపకాల్లోకి 90's బ్యాచ్..! షేక్ అవుతోన్న ట్విట్టర్..!!

Gum Bottle: ఆ అమ్మాయి ట్వీట్ తో జ్ఞాపకాల్లోకి 90’s బ్యాచ్..! షేక్ అవుతోన్న ట్విట్టర్..!!

Gum Bottle: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం దక్కింది. అంతేనా.. తమ టాలెంట్ ను బయటపెట్టుకునే అవకాశాలు కోకొల్లలుగా దక్కాయి. దీంతో సోషల్ మీడియాలో గడపకుండా దాదాపుగా ఎవరికీ రోజు గడవటం లేదు. దీంతో కొత్త కొత్త ఆలోచనలు, విభిన్న ఆవిష్కరణలు పెరిగాయి. కొందరిలో తమలో ఉన్న స్మార్ట్ నెస్ కి పదును పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Gb 1 | Telugu Rajyam

సోషల్ మీడియాలో కొందరు బ్యాక్ టు మెమరీస్.. అంటూ చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో పుట్టినవారు తమ చన్నప్పుడు ఉపయోగించిన వస్తువులు, ఆడిన ఆటలు, చదువుకు వాడిన పెన్నులు, పుస్తకాలు.. ఇలా ఎన్నింటినో షేర్ చేసుకుంటే గత జ్ఞాపకాల్లోకి వెళ్తూంటారు. అయితే.. ఇలాంటి సందర్భంలో ఓ నెటిజన్ మరో నెటిజన్ అయిన అమ్మాయిని నీ వయసెంత అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి.. ‘నా వయసు ఈ గమ్ బాటిల్ అంత’.. అంటూ ఓ గమ్ బాటిల్ ఫొటో పోస్ట్ చేసంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో షేక్ చేస్తోంది.

ఈ ఫొటో.. ఆమె ట్వీట్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఆ ట్వీట్ చేసిన అమ్మాయి ప్రియాంక తెలివితేటలు గురించి కంటే.. ఆ గమ్ బాటిల్ ను చూసి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయిన వారే చాలా ఎక్కువ. ఎందుకంటే.. ఆ రోజుల్లో దేన్నైనా అతికించాలంటే ఈ గమ్ బాటిలే దిక్కు. ఇప్పుడంటే గమ్ స్టిక్స్, గ్లూన్ గన్ లు వచ్చేశాయి. దీంతో ఈ గమ్ బాటిల్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ట్వీట్ వైరస్ స్థాయి ఎంతంటే ఏకంగా 13వేల లైక్స్, వేల సంఖ్యలో రీట్వీట్స్ తో దూసుకెళ్తోంది.

ఒక్క ఫొటో, ట్వీట్ తో ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు’, ‘ఈ గమ్ వాసన.. చేతులు అతుక్కోవడం గుర్తొస్తోంది’, ‘పుస్తకాల కవర్ పేజీలపై నేమ్ కార్డ్స్ అంటించాం దీంతో..’, ‘పోస్టాఫీసులో స్టాంపులు అంటించాం’, ‘నోట్సులో పేపర్ చిరిగిపోతే అంటించింది ఈ గమ్ తోనే..’.. అంటూ నెటిజన్లు తమ జ్ఞాపకాలతో ట్విట్టర్ ను హోరెత్తించేస్తున్నారు.

 

- Advertisement -

Related Posts

హిందీలో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ సినిమా కోసం వస్తోంది

  ఎన్టీఆర్ తర్వాతి సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.  'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా కావడంతో అభిమానుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో 'జనతా...

పోరు గడ్డపై ఉప పోరు

ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా కరీంనగర్నే సెంటిమెంట్ జిల్లాగా ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచే మలి...

కేంద్ర మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అంత సీన్ వుందా.?

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అరడజను సీట్లలో పోటీ చేసే అవకాశమూ దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ. బీజేపీ కంటే ఓట్ల శాతం పరంగా మెరుగ్గానే వున్నా, తిరుపతి ఎంపీ టిక్కెట్టుని...

Latest News