TV9 రజినీకాంత్, ఈ పేరు ఆంధ్రాలో వార్త ఛానళ్ళు చూసే వారందరికీ సుపరిచితమే. చాల వివాదాల తర్వాత ఈ మధ్యనే TV9 ఛానల్ యాజమాన్యం “మైహోమ్ గ్రూప్” రాజేశ్వర్ రావు చేతిలోకి వెళ్ళింది. అప్పటివరకు ఆ ఛానల్ సీఈఓగా వున్న రవిప్రకాష్ ఛానల్ నుండి బయటకు వెళ్లడమే కాకుండా, ఫోర్జరీ కేసులో చిక్కుకొని జైలుకు వెళ్లడం జరిగింది.
రవి ప్రకాష్ బయటకు వెళ్ళాడు కానీ అప్పటివరకు వున్న తన శిష్యులు మాత్రం అలాగే ఛానల్ లో ఉండిపోయారు. రజినీకాంత్ ప్రైమ్ టైం డిబేట్ నిర్వహిస్తూ ఛానల్ నెంబర్ వన్ స్థానాన్ని కాపాడడానికి తన వంతు ప్రయత్నం అయితే చేసారు. మురళి మాత్రం ఉదయం జరిగే న్యూస్ ఎనాలిసిస్ మరియు ఎన్కౌంటర్ విత్ మురళి కృష్ణ నిర్వహిస్తూ వస్తున్నారు.
రజనీకాంత్ మరియు మురళి మధ్య విభేదాలు ఉన్నాయని, TV9 ఉద్యోగస్థులంతా రెండు గ్రూపులుగా విడిపోయారని మీడియా సర్కిల్స్ లో రూమర్స్ వున్నాయి. ఇదేంతవరకు నిజమో కానీ TV9 యాజమాన్యానికి రజినీకాంత్ రవి ప్రకాష్ శిష్యుడు అనే ఒక అభిప్రాయం ఉందట. గ్రూప్లులు వల్లనో మారె కారణం చేతనో రజినీకాంత్ నిన్నటి నుండి TV9 నుండి వైదొలిగారు.
ఈ గ్రూపులు ఎలా వున్నా రజనీకాంత్ కు మాత్రం డిబేట్ ని రక్తి కట్టించగల సామర్థ్యం పుష్కలంగా వుంది. అతనికి కోసం అన్ని ఛానళ్ళు ఓపెన్ ఆఫర్లు ఇవ్వడానికి రెడీ గా వున్నాయి. ఏబీన్, TV5 పక్కా తెలుగు దేశం అనుకూల మీడియా, అందులోనూ తెలుగుదేశం ప్రతిపక్షంలో వుంది కాబట్టి అందులో చేరే అవకాశం అయితే లేదు. 10TV వచ్చేసి tv9 అనుబంధ ఛానల్ కాబట్టి అక్కడ అవకాశం వుండకపోవొచ్చు. ఇక మిగిలిన పెద్ద చానెల్స్ లో సాక్షి మరియు NTV వున్నాయి.
సాక్షి ఇప్పుడు వున్న పరిస్థితుల్లో రజినీకాంత్ లాంటి వారికోసం ఎదురు చూస్తుంది. అయితే ఇది వైస్సార్సీపీ అనుకూల ఛానల్ కాబట్టి అందులో చేరే అవకాశాం కూడా చాలా తక్కవే. ఏదన్నా అధికార ఒత్తిళ్లు వస్తే అది సాధ్యపడవొచ్చు. ఇక మిగిలింది NTV . వీళ్ళు చాలా కాలం నుండి ఒక మంచి యాంకర్ కోసం చూస్తున్నారు. కొద్దొ గొప్పో డిబేట్ నిర్వహించగల రిషి ఈ మధ్యనే NTV వదిలి 99TV కి వెళ్లారు. కాబట్టి NTV రజినీకాంత్ డిమాండ్ చేసినంత ఇచ్చి అతన్ని తీసుకుండే అవకాశం వుంది.
కాబట్టి త్వరలో మనం NTV రజినీకాంత్ ను లేకుంటే సాక్షి రజినీకాంత్ ను చూసే అవకాశం ఉంది!