మీడియా కింగ్, టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు హైకోర్టులో ఊరట దక్కింది. ముందస్తు బెయిల్ కు కోర్టు అనుమతిచ్చింది. దీంతో మీడియా కింగ్ కు ముందస్తు జైలు తప్పింది. రవిప్రకాష్ టీవీ-9 లో అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాండ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల నిధులను ఎలాంటి అనుమతులు లేకుండా..పోర్జరీ సంకతాలతో ఉపసంహరించినట్లు తోటి భాగస్వామి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కేసు ఈడీ విచారణ చేపడుతోంది.
ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కు హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు అయింది. అలాగే లక్ష చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని, ప్రతీ శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని కండీషన్ పెట్టింది. అయితే బెయిల్ మంజూరైనా ఈడీ విచారణ కొనసాగించేలా కోర్టు అనుమతులు ఇచ్చింది. ఇక రవిప్రకాష్ మీడియాని ఏ రేంజ్ లో ఏలాడో చెప్పాల్సిన పనిలేదు. మీడియా లో ఓ మాఫియానే సృష్టించాడు. తనదైన మార్క్ తో టీవీ-9కి ఓ ఐడెంటిటీ తీసుకొచ్చాడు. జాతీయ స్థాయిలో ఆఛానల్ కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాడు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నంత కాలం ఆ ఛానల్ లో నీతులు…సూక్తులు విపరీతంగా వల్లించేవారు. కానీ ఆయన అరెస్ట్ అవ్వడం..తర్వాత ఛానల్ మేనేజ్ మెంట్ మారడంతో అన్నింటికీ కటీఫ్ పడింది. ప్రస్తుత అతి తగ్గించి అవసరం మేర వార్తల్ని ప్రసారం చేస్తోంది.