‎Tunnel Trailer: లావణ్య త్రిపాఠి టన్నెల్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే!

Tunnel Trailer: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికి తెలిసిందే. అందాల రాక్షసి మూవీతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే లావణ్య ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేసింది.

‎ఇక ఇటీవల మెగా వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి గర్భవతి. పెళ్లికి ముందు అడపాదడపా సినిమాలలో నటించిన లావణ్య త్రిపాఠీ పెళ్లి తర్వాత మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చింది. అలా లావణ్య నటించిన ఒక మూవీ ఇప్పుడు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ వివరాల్లోకి వెళితే తమిళ్ హీరో అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న సినిమా టన్నెల్.

‎రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ సినిమా టన్నెల్‌ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. తెలుగు డబ్బింగ్ తో ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అథర్వ మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్స్ లో సినిమా తీస్తే అది అదిరిపోతుంది అని ప్రేక్షకుల నమ్మకం. అయితే ఇటీవల తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అథర్వా మురళి పోలీస్ గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల అయిన తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. మరి ఈ సినిమా లావణ్య త్రిపాఠికి ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.