హెచ్ 1 బీ వీసా అభ్యర్థులకి ట్రంప్ న్యూ ఇయర్ షాక్ !

డోనాల్డ్ ట్రంప్ .. అగ్రరాజ్యం అమెరికా అధినేత. ఈ మద్యే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఘోర పరాజయం పాలైయ్యాడు. ఈ నెల 20 తో డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగియబోతుంది. ఆ తర్వాత బైడెన్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ ఉండేది మరికొద్ది రోజులే అయిన ఇండియన్స్ కి న్యూ ఇయర్ కి భారీ షాక్ ఇచ్చాడు. భారతీయ ఐటీ ఉద్యోగలకు ఇబ్బందికరంగా మారిన ఓ కీలక ఆదేశాల గడువు కాసేపట్లో ముగుస్తుందనగా మరో ట్విస్ట్ ఇచ్చాడు.

trump was defeated by joe biden

అమెరికాలోకి విదేశీ ఉద్యోగుల రాకపోకలను నిషేధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.. వాస్తవానికి ఈ ఆదేశాల గడువు డిసెంబర్ 31.. అంటే గురువారంతోనే ఈ గడువు ముగిసింది.. కానీ ట్రంప్ వ్యూహాత్మకంగా.. మరికొద్ది గంటల్లో ఈ ఆదేశాల గడువు తీరిపోతుందగా.. ఊహించని షాకిచ్చారు.. అమెరికాలోకి విదేశీ ఉద్యోగుల ఎంట్రీపై నిషేధాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.. అంటే మార్చి 30 వరకు అమెరికాలోకి భారత్ సహా విదేశాల పౌరులు ఉద్యోగాల కోసం అడుగుపెట్టలేరు.

వాస్తవానికి ఈ ఆదేశాల గడువు ముగుస్తుందని హెచ్ 1 బీ వీసా అభ్యర్థులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. జనవరిలో ఐటీ ఉద్యోగులను హెచ్ 1 బీ వీసాపై అమెరికాకు పంపించేందుకు భారత్ లోని బడా బడా కంపెనీలు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి.. కానీ ట్రంప్ వీరికి ఊహించని రీతిలో చెక్ పెట్టినట్టయింది.. ట్రంప్ నిర్ణయం. భారతీయ ఐటీ ఉద్యోగలకే కాకుండా కంపెనీలకు కూడా విఘాతంగా మారనుంది.