Donald Trump: ట్రంప్ కఠిన నయా పాలసీ.. అక్రమ వలసలు తగ్గాయా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద అక్రమ వలసల సంఖ్య భారీగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది మాత్రమే అక్రమంగా ప్రవేశించాలని యత్నించారని, ఇది చరిత్రలోనే అత్యల్ప సంఖ్య అని తెలిపారు. తన కఠిన వలస విధానాల ఫలితంగా సరిహద్దు పూర్తిగా మూసివేయబడిందని, ఇకపై అక్రమ వలసదారులకు అమెరికాలో స్థానం లేదని స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రకటనలో బైడెన్ పాలనలో నెలకు 3 లక్షల మంది అక్రమంగా సరిహద్దు దాటేవారని, కానీ తన పరిపాలనలో ఈ సంఖ్య 96% తగ్గిందని తెలిపారు. బైడెన్ కాలంలో ఈ వలసదారుల్లో చాలా మందిని అమెరికాలోకి చేర్చుకున్నారని, కానీ ఇప్పుడు తన పాలనలో వారిని వెంటనే వెనక్కి పంపిస్తున్నామని అన్నారు. తన అధికారంలోకి వచ్చిన తొలి రోజే మానవతా ప్రాతిపదికన ప్రవేశం కోసం వలసదారులు అపాయింట్‌మెంట్ తీసుకునే విధానాన్ని రద్దు చేశారని వివరించారు.

అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై పలు మీడియా సంస్థలు రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, ట్రంప్ మొదటి వారం రోజుల్లో 7,287 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. ఇది గత ప్రభుత్వంలో చివరి వారంలో నమోదైన 20,086 మంది కంటే తక్కువగానే ఉన్నా, 95% తగ్గుదల అనే ట్రంప్ చెప్పిన గణాంకాలకన్నా తక్కువ, 60% మాత్రమే తగ్గిందని తెలుస్తోంది. అంతేకాదు, బైడెన్ హయాంలో కొన్ని నిబంధనల ప్రకారం లీగల్ అనుమతితో వచ్చిన వారిని కూడా అక్రమ వలసదారులుగా లెక్కించారని విమర్శలు వస్తున్నాయి.

అయితే, ట్రంప్ తన విధానాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దు గస్తీని బలోపేతం చేయడం, మిలిటరీ మోహరించడం, మునుపటి పాలనలో ప్రారంభించిన మానవతా ప్రాతిపదికన వలసదారులకు ప్రవేశ అనుమతి కల్పించే యాప్‌ను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వ హక్కులు ఉండవచ్చని చెబుతూ, బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని కూడా రద్దు చేశారు.

ట్రంప్ పాలనలో తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు అక్రమ వలసలను నిజంగా తగ్గిస్తున్నాయా, లేక గణాంకాల ప్రదర్శన మాత్రమేనా అనే చర్చ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చెలరేగుతోంది. బైడెన్ నయా వలస విధానాలను పూర్తిగా రద్దు చేసి, కొత్త చర్యలు అమలు చేస్తుండటంతో ఈ మార్పులు మరింత చర్చనీయాంశంగా మారాయి.

సంపద సృష్టి బాబు మెడకు చుట్టుకుంటుందా! || Chandrababu Naidu Wealth Creation In AP || Ap Budget || TR