తెరాస ఘోర తప్పిదం… హరీష్ రావు ఇదేనా నీ తెలివి

harish rao telugu rajyam

 తెలంగాణలో ఉప ఎన్నికలు అంటే ఖచ్చితంగా తెరాస పార్టీనే విజయం సాధిస్తుందనే కొండ గుర్తు అందరికి ఉంది , ప్రత్యర్థి పార్టీలు సైతం చాలా సార్లు ఉప ఎన్నికల్లో తెరాస ముందు చేతులెత్తేశాయి. అలాంటి విన్నింగ్ చరిత్ర కలిగిన తెరాస పార్టీ నేడు దుబ్బాక ఉప ఎన్నికల కోసం కింద మీద పడుతుంది. తెరాస వాలకం చూస్తుంటే లక్ష మెజారిటీ ఏమో కానీ గెలిస్తే పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

trs telugu rajyam

  తాజాగా బీజేపీ నేత రఘునందన్ విషయంలో పోలీసులు చేసిన అతికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. మరోపక్క బండి సంజయ్ ను గాయపడేలా చేసి, వాహనంలో కుక్కిమరి తీసుకుపోవటంతో ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దాని గురించి వాకబు చేయటం, హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన సిద్దిపేట రావటం తో దుబ్బాకలో ఏమి జరుగుందో అర్ధం కానీ పరిస్థితి ఎదురైంది. ఈ ఎపిసోడ్ లో బీజేపీ కి బాగా సానుభూతివెల్లువెత్తుతోంది.

  దుబ్బాక తెరాస వ్యవహారాలు చూస్తున్న హరీష్ రావు మెప్పు కోసమే పోలీసులు ఇలాంటి పనులు చేస్తున్నారని, బీజేపీ ని టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో తెరాస కు వ్యతిరేకంగా ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల సమయంలో కొన్నికొన్ని నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, కొంచం తేడా కొట్టిన ఎన్నికల ఫలితాల్లో తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు తెరాస కు అదే జరుగుతుంది. నిజానికి తెరాస కు సానుభూతి ఎక్కువగానే ఉంది, ఎన్నికల్లో గెలుపు ఖాయమనే అందరు అనుకుంటున్నారు.

harish rao telugu rajyam

 అలాంటి సమయంలో బీజేపీ నేతలను టార్గెట్ చేయటం ఆ పార్టీకి లేని బలాన్ని ఇచ్చినట్లు అయ్యింది. ఒక పక్క రఘునందన్ ఇంట్లో పోలీసులే డబ్బులు పెట్టబోయారని, మరో పక్క బండి సంజయ్ ను చిత్ర హింసలు పెట్టారనే వార్తలతో ఒక్కసారిగా బీజేపీ కి సానుభూతి పెరిగిపోతుంది. ఎన్నికల్లో పదునైన వ్యూహాలు రచించి, అవతలి పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తాడనే పేరున్న హరీష్ రావు సారథ్యంలో ఇలాంటి పేవలమైన వ్యూహాలు ఏమిటో అర్ధం కావటం లేదు. ఈ ఎపిసోడ్ లో హరీష్ రావు హస్తమున్న లేకపోయినా కానీ, దానికి హరీష్ రావు కు ముడిపెడుతూ మాట్లాడటం సహజం,ఆయన అనుమతితోనే పోలీసులు ఇలా చేస్తున్నారనే అభిప్రాయం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది, దాని ప్రభావం కచ్చితంగా దుబ్బాక ఎన్నికలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట