తెలంగాణ మంత్రి,కెసిఆర్ ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు

trs minister niranjan reddy made sensational comments on pawan kalyan

హైదరాబాద్‌: తెలంగాణలో వరద బాధితులకు కేంద్రంలో బీజేపీ పార్టీ ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా? అని ప్రశ్నించారు. ‘‘వరద బాధితులను కేసీఆర్ సర్కార్‌ ఆదుకుంటే బీజేపీ ఆరోపణలు చేస్తోంది. హైదరాబాద్‌లో మేం సాయం చేస్తే అడ్డుకుంటారా?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ జనసేన రావటాన్ని ఆయన ఎటకారం చేస్తూ… జనం లేని సేన జనసేన..సేన లేని నాయకుడు పవన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారని, ఎందరు కలిసినా ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

trs minister niranjan reddy made sensational comments on pawan kalyan
trs minister niranjan reddy made sensational comments on pawan kalyan

నిజమైన హిందువు కేసీఆరేనని టీఆర్‌ఎస్‌ నేత ‘కేకే’ అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్నది టీఆర్‌ఎస్‌ విధానమని తెలిపారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పెట్టామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకు కేటాయించామని చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని కేకే పేర్కొన్నారు.ఈ ఎన్నికలలో ప్రజలు తెరాస పార్టీనే గెలిపిస్తారని ఆయన అన్నారు.