సీఎం కేసీఆర్ అంత సాహసం చేస్తారా.. అందుకు అంగీకరిస్తారా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉపఎన్నికలు తెగ టెన్షన్ పెడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్ కు కీలకం అనే సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికకు కేసీఆర్ కేటీఆర్ ను ఇన్ఛార్జిగా నియమిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో గెలుస్తామనే ఉపఎన్నికలలో కేటీఆర్ ను గెలవమనే ఉపఎన్నికలలో హరీష్ రావును కేసీఆర్ ఇన్ఛార్జిగా నియమిస్తున్నారనే టాక్ ఉంది.

కేసీఆర్ పార్టీ నేతలకు హైరానా పడవద్దని హడావిడి ఆర్భాటాలు వద్దని చెప్పారని సమాచారం. మునుగోడు ఉపఎన్నిక ఫలితం విషయంలో కేసీఆర్ కు కాన్ఫిడెన్స్ ఉందో లేదో నియమించే ఇన్ఛార్జిని బట్టి తెలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి గెలవగలననే నమ్మకంతో బీజేపీ తరపున పోటీ చేస్తుండగా కోమటిరెడ్డి ఈ ఎన్నికలో గెలవడం కీలకం అని చెప్పవచ్చు.

ఒకవేళ ఈ ఎన్నికలో ఓడిపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి. కోమటిరెడ్డిని ఓడించడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు విషయంలో కేసీఆర్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించడం ద్వారా అధికార పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమేనని కేసీఆర్ సంకేతాలను ఇచ్చారు.

మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో ఎవరికి వ్యతిరేకంగా వస్తాయో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కాంగ్రెస్ కు అనుకూలంగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడే ఛాన్స్ లేదు. అధికార పార్టీ ఎంపిక చేసే అభ్యర్థిని బట్టి టీ.ఆర్.ఎస్ మునుగోడులో గెలిచే ఛాన్స్ ఉందో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.