దుబ్బాకలో ఆఖరి అస్త్రం ప్రయోగిస్తున్న తెరాస…

trs party

 దుబ్బాక ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తమ శక్తి మేరకు పోరాటం చేస్తున్నాయి, ఇక హరీష్ రావు దాదాపు రెండు మూడు నెలల నుండి దుబ్బాకలోనే మకాం పెట్టి ఎన్నికల బాధ్యతను మోస్తున్నాడు. నోటిఫికెషన్ సమయానికి దుబ్బాకలో తెరాస విజయానికి సానుకూలమైన పవనాలు కనిపించిన కానీ, రేణూ రాను పరిస్థితి మారిపోయింది.

dubbaka elections

 బీజేపీ తరుపున బలమైన రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున తెరాస రెబల్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయటం, బీజేపీ , కాంగ్రెస్ నాయకత్వాలు కూడా దుబ్బాక ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకోవటంతో తెరాస కు గెలుపు అంత ఈజీ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఉన్న వనరులను గట్టిగా ఉపయోగించుకోవాలని మంత్రి హరీష్ రావు ఆలోచిస్తున్నాడు.ఇందులో భాగంగా తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఒక్కసారి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అనుకుంటున్నారు, ప్రచారానికి చివరి రోజు కేసీఆర్ తో ఫైనల్ టచ్ ఇస్తే ఇక తెరాస కు ఎదురులేదని భావిస్తున్నారు. 

 గతంలో కేసీఆర్ సిద్దిపేట నుండి ఎమ్మెల్యే గా పనిచేశాడు , ఇప్పుడు గజ్వేల్ నుండి ఎన్నికయ్యాడు. ఈ రెండు కూడా దుబ్బాక కు పక్క పక్కనే ఉంటాయి, పైగా సిద్దిపేట లోని పది గ్రామాలకు పైగా దుబ్బాకలో కలిసిపోయాయి కాబట్టి కేసీఆర్ ప్రచారానికి వస్తే ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు తెరాస కు అనుకూలంగా మారే అవకాశం ఉందని తెరాస వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

 పైగా దుబ్బాక లో పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం హరీష్ రావు ఖాతాలోకి వెళ్తుంది కనుక కేసీఆర్ అక్కడ ప్రచారం చేస్తే అందులో కేసీఆర్ వాటా కూడా ఉందని చెప్పుకోవచ్చు అంటూ హరీష్ రావు వ్యతిరేక వర్గం కూడా భావించి ఆ మేరకు కేసీఆర్ కు సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తుంది. దీనితో అన్ని రకాలుగా ఆలోచించిన కేసీఆర్ అందుకు సిద్ధమే అని తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల నుండి తెలుస్తుంది. దుబ్బాకలో తెరాస ప్రయోగిస్తున్న చివరి అస్త్రం ఏమైనా ఉందా అంటే అది కేసీఆర్ ఎన్నికల ప్రచారమే అని చెప్పాలి