Trivikram: సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలు త్రివిక్రమ్…. నెక్స్ట్ ప్లాన్ ఏంటి…. రాజకీయాలలోకి రాబోతున్నారా?

Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవునని సమాధానం వినపడుతుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. సినిమాలపై ఆసక్తితో ఎంతో కష్టపడి డైలాగ్ రైటర్ గాను సినీ రచయితగాను ఎంతో మంచి సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ అనంతరం దర్శకుడిగా మారారు.

ఇలా దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేశారు ఈ సినిమా తర్వాత ఈయన అల్లు అర్జున్ తో మరో సినిమాకు కమిట్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.

ఈ సినిమా పూర్తి అయిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు దూరం కాబోతున్నారని సమాచారం. ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన తర్వాత ఏం చేయబోతున్నారు అనే విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలోనూ అలాగే సినీ జీవితంలో కూడా వెనుకుండి ఆయనని ముందుకు నడిపిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజకీయాలలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారని అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈయన కూడా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారట అందుకే ఇప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలలో భాగం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారని ఈ కారణంతోనే సినిమాలకు దూరం అవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.