టాక్ : బాలయ్య సినిమాతో నందమూరి అభిమానులకు ట్రిపుల్ ట్రీట్..?

నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “అఖండ” రిలీజ్ కి సిద్ధం అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మాస్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ఈ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది.

అయితే ఈ చిత్రం తో పాటుగా థియేటర్స్ లో ఇంకో రెండు భారీ సినిమాల టీజర్స్ కూడా పడనున్నాయట. దీనితో నందమూరి అభిమానుల కు ట్రిపుల్ ట్రీట్ దక్కనుంది అట. టాక్ ఏమిటంటే అఖండ సినిమాతో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) టీజర్ గ్లింప్స్ ని.

అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన నెవర్ బెఫోర్ కాన్సెప్ట్ విజువల్ డ్రామా “బింబిసారా” టీజర్ ని కూడా ప్లే చెయ్యనున్నారట. అంటే థియేటర్స్ లో బాలయ్య సినిమాతో పాటుగా ఈ రెండు టీజర్స్ తో రచ్చ రచ్చే.. అని చెప్పాలి. అయితే కళ్యాణ్ రామ్ సినిమా టైం ట్రావెల్ మరియు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.