ట్రైలర్ టాక్ : తెలుగులో ఇంటెన్స్ విజువల్స్ తో భారీ హిట్ “కాంతారా”..!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మన తెలుగు ఇండస్ట్రీ తో పాటుగా కన్నడ ఇండస్ట్రీ కూడా పోటా పోటీగా సినిమాలతో ఆదరణను అందుకుంటుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ హౌస్ హోంబేలె ఫిల్మ్స్ నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా హార్డ్ హిట్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఏడాదిలో కేజీఎఫ్ 2 సినిమాతో పాటుగా వచ్చిన మరిన్ని చిత్రాలు భారీ హిట్స్ అయ్యాయి.

అలాగే తాజాగా కొన్ని వారాల కితమే వచ్చిన మరో భారీ హిట్ సినిమా “కాంతారా”. జస్ట్ కన్నడ భాషలోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం షాకింగ్ రెస్పాన్స్ అందుకుంది. దీనితో తెలుగు ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా చూపించడంతో రిషబ్ శెట్టి దర్శక, హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

మరి ఇప్పుడు అయితే చిత్ర యూనిట్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ నరేషన్ నుంచే చాలా ఆసక్తిగా మొదలైంది. సినిమా కథను చెప్తూ భూమి కోసం, భూమిలో జరిగే పోరాటం అన్నట్టుగా స్టన్నింగ్ విజువల్స్ తో కనిపిస్తుంది.

ముఖ్యంగా చూసిన వెంటనే ఆడియెన్స్ కి టచ్ అయ్యేది సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజనీష్ లోకనాథ్ ఇచ్చింది చాలా ఎఫెక్టీవ్ గా ఆసక్తి రేపుతోంది. ఇంకా ఒక ఊరికి పోలీసులకి జరిగే గొడవలో నేటివిటీ చాలా ఆసక్తిగా ఉంది. మొత్తంగా అయితే ట్రైలర్ తో తెలుగులో మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. మరి ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తుండగా దీనికి ఈ అక్టోబర్ 15న డేట్ కన్ఫర్మ్ చేశారు.