ట్రైలర్ టాక్ : టాలీవుడ్, బాలీవుడ్ ల అడ్వెంచర్ జర్నీలా “రామ్ సేతు”.!

బాలీవుడ్ సినిమా దగ్గర ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాలు అనుకున్న రేంజ్ లో రాణించలేదు. ఇక పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అయ్యినవి కూడా అంతగా రాణించలేదు కానీ మంచి ఓపెనింగ్స్ సాధించినవి ఉన్నాయి. మరి ఫైనల్ గా ఇపుడు బాలీవుడ్ దగ్గర నుంచి వచ్చి అదృష్టం పరీక్షించుకొడానికి వస్తున్న చిత్రం “రామ్ సేతు”.

అక్కడి స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా మన టాలీవుడ్ హీరో సత్యదేవ్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రామాయణం టచ్ లో తెరకెక్కింది. అయితే ఒక బాలీవుడ్ సినిమా అనే కన్నా మన సౌత్ ఇండియా సినిమా నటులు కూడా ఇందులో కనిపించడం విశేషం.

అయితే దర్శకుడు అభిషేక్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ సేతు కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కథ కనిపిస్తుంది. మరి దీనిపై వచ్చే ఓ మిషన్ పై స్పెషలిస్ట్ అక్షయ్ కుమార్, సత్యేదేవ్ లను పంపడం అనేక అంశాల్లో చాలా ఆసక్తిగా కనిపిస్తుంది.

రీసెంట్ గా మన టాలీవుడ్ భారీ హిట్ “కార్తికేయ 2” తరహాలో మన పురాణాలకి సంబంధించి కృష్ణుడు కోసం చూసినట్టు అయితే ఇందులో రాముని కోసం చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. ఇంకా ఇందులో మ్యూజిక్ కూడా సీనియా ట్రైలర్ ని అయితే లేపింది.

మొత్తంగా చూసినట్టు అయితే దీనికి మంచు లక్ దొరికే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఈ అక్టోబర్ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 
Ram Setu | Official Trailer | Telugu | Akshay Kumar | Only in Theatres 25th Oct 2022