ఇది వరకే బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పుకున్నాము. థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన సినిమాలు అనుకుంటే ఇప్పుడు అక్కడ ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా దారుణమైన రెస్పాన్స్ నే అందుకుంటూ ఉండడం మరింత షాకింగ్ గా మారుతుంది.
బాలీవుడ్ లో ఎలాంటి విషయంలో అయినా కూడా భారీ రెస్పాన్స్ ఫస్ట్ డే అందిస్తారు. లేకపోతె మంచి టాక్ వస్తే నెక్స్ట్ మరింత స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఇది వరకు కూడా చిత్రాల్లో కొన్ని ఓటిటి లో వచ్చినపుడు ఫస్ట్ డే ఆల్ టైం ఇండియన్ రికార్డు వ్యూస్ వచ్చేవి.
కానీ ఇపుడు షాకింగ్ ఓ స్టార్ హీరో సినిమా అది కూడా డైరెక్ట్ ఓటిటి లో రిలీజ్ అయ్యినప్పటికీ కూడా డిజాస్టరస్ రెస్పాన్స్ ని తెచ్చుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సినిమా మరెవరిదో కాదు బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో అక్షయ్ కుమార్ సినిమా “కట్ ఫుట్లి” సినిమా అట.
ఈ చిత్రం తమిళ భారీ హిట్ “రాట్సాసన్” తెలుగులో బెల్లంకోసం శ్రీనివాస్ నటించిన “రాక్షసుడు” కి రీమేక్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమా గత వారం హాట్ స్టార్ లో రిలీజ్ చేయగా దీనికి అసలు డిజాస్టర్ వ్యూస్ వచ్చాయట. జెనరల్ గా డైరెక్ట్ రిలీజ్ సినిమా అంటేనే మినిమం వ్యూస్ వస్తాయి.
కానీ ఇక్కడ స్టార్ హీరో అందులో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ ఉన్న సినిమా అయినా హాట్ స్టార్ లో అతి తక్కువ వ్యూస్ అందుకున్న సినిమాగా నిలిచింది అని ఓటిటి వర్గ నిపుణులు అంటున్నారు. దీనితో బాలీవుడ్ నుంచి వరుసగా మరో డిజాస్టర్ వచ్చింది అని ఆడియెన్స్ అంటున్నారు.