ఆ స్టార్ దర్శకునితో తారక్.. భయపడిపోతున్న ఫ్యాన్స్.!

NTR

NTR  : రీసెంట్ గా మన తెలుగు సినిమా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి తన బర్త్ డే కానుకగా రెండు భారీ అనౌన్సమెంట్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకటి దర్శకుడు కొరటాల శివతో తన 30వ సినిమా కాగా మరొకటి కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసే 31వ సినిమా నుంచి వచ్చింది.

అయితే ఈ సినిమా నుంచి ఏకంగా ఫస్ట్ లుక్ రావడంతో దానికి సంచలన రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాల పరంగా సూపర్ హ్యాపీగా ఉన్న అభిమానులు మరో దర్శకుడు పేరు చెప్తే భయపడిపోతున్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో తన ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ తో కలిసి స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపించడమే వారి భయానికి కారణం అట.

ఎన్టీఆర్ తో కలిసి వంశీ చాలా క్లోజ్ గా కొన్ని ఫోటోలలో కనిపించడం ఒకరకమైన ఆందోళనను కలిగిస్తుంది. కొంపదీసి ఎన్టీఆర్ తో సినిమా గాని ఓకె చేసుకున్నాడా? మాకు వద్దురా బాబు నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఊహించని కలయిక తారక్ అభిమానుల్లో చిన్నపాటి అలజడినే రేపింది. అయితే ఈ కలయికపై ఒక క్లారిటీ భవిష్యత్తులో ఏమన్నా వస్తుందేమో చూడాలి.